Tuesday, January 22, 2013

కరుణించవా...

ఉదయించే సూర్యుని వర్ణాన్ని చూసి అనుకున్నా
సిగ్గుతో ఎరుపెక్కిన నా సఖి బుగ్గల్లోనిదే ఆ ఎరుపని,

వీచే చల్లని గాలి స్పర్శతో తెలుసుకున్నా
ఈ మందమారుతము నీ కురులను కౌగిలించుకున్నదేనని,

గల గలా పారుతున్న సెలయేటి చప్పుళ్ళను విని ఊహించుకున్నా
నీ అందెల రవముల రాగాన్ని,

కోనేటిలోని కలువలను చూసి కనుగొన్నా
హ్రుదయాలను కదిలించే కన్నులు నీవని,

పున్నమి చంద్రుని చూసి ఆశపడుతున్నా
చల్లని నీ ప్రేమ వెన్నెల జల్లుల్లో తడిసి ముద్దవ్వాలని,

కాని

అస్తమించని సూర్యునిలా నాతో ఉండవా,
వీచే గాలిలా కాకుండా పీల్చే శ్వాసవై నాలో కలిసిపోవా,
పారే నీటిలా నాలో అణువణువూ స్ప్రశించవా,
కోనేటిలో కలువలా నాలో నీవుండిపొవా,
చందమామలా కాకున్నా
కనీసం కనిపించీ కనిపించని చుక్కంత ప్రేమనైన నాపై కురిపించవా..?

3 comments:

Unknown said...

Superb....
Is it your own creation...???
Really Nice

Ompranush said...

ya.. :)

K@$H said...

సృజనాత్మకత ఆధిరింది మిత్రమ !! జొహార్ !!

జయ్ నాయక !! జయ్ జయ్ నాయక !!

నాన్న

ఇవాళ సాయంత్రం చెల్లి ఇంటి నుండి తిరిగి వస్తుంటే ఎందుకో మేము చిన్నప్పుడు కలిసి చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.మా నాన్నగారు మమ్మల్ని తీసుకువె...