Monday, May 13, 2013

అమ్మ


వసంత కాలం,
విరజాజుల పరిమళం,
నిండు చంద్రుని పండు వెన్నెల చల్లదనం,
అమ్మ చెతి గోరు ముద్ద మదురం,
అమ్మ ఒడిలో నిదురించిన ఆ క్షణం సుమధురం.

Tuesday, May 7, 2013

చక్కనమ్మ...!

చక్కనమ్మ చిక్కినా అందమే,
చిక్కకున్నా నువ్వు చక్కని చుక్కవే,
కారు చీకటిని కనుపాపని చేసావు,
చిక్కని చీకటిని చెంపన చుక్కని చేసావు,
కన్న తల్లి కళ్లలోన కదిలే అనందమా 
నీకేల తగులును ఆ కను దిష్టి,
ఏ చింతలూ లేక నిదురపోవమ్మ చక్కనమ్మ !

Friday, February 22, 2013

Talking


The most important thing in all human relationships is "talking"  but unfortunately we don't sit down to talk. 
We go to theatre , watch movie or play some games or we listen to music. May be after some days we forget how to share our feelings with others or at least with our family members.  

Tuesday, January 22, 2013

కరుణించవా...

ఉదయించే సూర్యుని వర్ణాన్ని చూసి అనుకున్నా
సిగ్గుతో ఎరుపెక్కిన నా సఖి బుగ్గల్లోనిదే ఆ ఎరుపని,

వీచే చల్లని గాలి స్పర్శతో తెలుసుకున్నా
ఈ మందమారుతము నీ కురులను కౌగిలించుకున్నదేనని,

గల గలా పారుతున్న సెలయేటి చప్పుళ్ళను విని ఊహించుకున్నా
నీ అందెల రవముల రాగాన్ని,

కోనేటిలోని కలువలను చూసి కనుగొన్నా
హ్రుదయాలను కదిలించే కన్నులు నీవని,

పున్నమి చంద్రుని చూసి ఆశపడుతున్నా
చల్లని నీ ప్రేమ వెన్నెల జల్లుల్లో తడిసి ముద్దవ్వాలని,

కాని

అస్తమించని సూర్యునిలా నాతో ఉండవా,
వీచే గాలిలా కాకుండా పీల్చే శ్వాసవై నాలో కలిసిపోవా,
పారే నీటిలా నాలో అణువణువూ స్ప్రశించవా,
కోనేటిలో కలువలా నాలో నీవుండిపొవా,
చందమామలా కాకున్నా
కనీసం కనిపించీ కనిపించని చుక్కంత ప్రేమనైన నాపై కురిపించవా..?

ఒంటరి

నేను ఒంటరిని,
ఈ పరిగెత్తే మనుషుల్లో,పొటీ ప్రపంచంలో.
గతి తప్పిన గమనం నా పయనం,
ప్రతి రోజు చేస్తున్నా ఈ జీవితంతో ఒక సమరం,
వేచి చూస్తున్నా నా ఒంటరితనాన్ని దూరం చేసే ఆ తుది శ్వాస కోసం.
ఎదురు చుస్తున్నాను ఓ మరణమా,
నీ ఒడిలో చేరే ఆ క్షణం కోసం,
ఈ ఒంటరితనపు చీకటిని దాటడం కోసం.

Thursday, January 17, 2013

లేఖ

ఓ మిత్రమా,

నీ దూరంతో బరువెక్కిన హ్రుదయం సాక్షిగా నీకు రాస్తున్న మొదటి లేఖ,

కొన్ని కొన్ని సార్లు మనం ఎందుకు వింతగా ప్రవర్తిస్తామో, ఎందుకు మనకే తెలియకుండా బాధ పడుతుంటామో అర్థం కాదు. ముఖ్యంగా ఎవరైనా మనకి కావలసిన వాళ్ళు దూరమౌతుంటే మనకి అర్థం కాని ఎన్నో భావాలు మనలో కలుగుతూ ఉంటాఈ. ఇది సహజమా లేక ఈ భావన కల్పితమా..? దీనికి సమధానం మాత్రం కాలం కచ్చితంగా ఇవ్వలేదు, ఇది మనిషి నుండి మొదలైంది కాబట్టి మనిషే దీనికి  సమాధానం ఇవ్వాలి? ప్రేమకి అర్థం ఎంటో నాకు తెలియదు కాని స్నేహం అంటే ఎంటో మాత్రం తెలుసు. ఎన్నో ఏళ్ళు నీ సావాసం  ఒక్కసారిగా దూరం ఐతే ఆ దూరం మిగిల్చే అగాథం పూడ్చలేనిది. ఎన్నో మార్గాలు ఉండి ఉండొచ్చు ఆ శూన్యాన్ని పూరించేందుకు కాని దాని ఆనవాల్లని మాత్రం చెరపలేవు. ఎన్నేళ్ళైనా ఆ గుర్తులు చెరిగిపోవు. స్నేహానికి ఎల్లలు లేకపొవచ్చు కాని మనుషుల మధ్య  దూరానికి కొలమానాలు ఉన్నాఈ.మనసులకి దూరం లేదేమో కాని మనసుకి దగ్గరైన మనుషులు దూరమైనప్పుడు మనసుపడే అవేదనకి హద్దులు లేవు.మంచి ఆశయంతో దూరంగా ఉంటున్నారని మన మనసుని సమాధాన పరుచుకొని సంత్రుప్తి చెందడం మినహా మనం చేయగలిగేది ఏమీ లేదు.

 ఓ మిత్రమా నీ పడమటి వైపు ప్రయాణం నిన్ను నీ ఆశయానికి దగ్గర చేస్తుంది అంటే దానికి మించిన అనందం మాకేముంటుంది చెప్పు,కాని నీకొసం నిరీక్షించే కళ్ళు ఉన్నాయని, నీ స్నేహామౄతం కోసం తపించే రెండు హ్రుదయాలు నీ రాక కోసం వేచి చూస్తుంటాయని మరువకు …
                   
                                                                                                                  ఇట్లు                                                                                                                                                                                                                      ఓం & నిఖిల్

Wednesday, January 16, 2013

ఓ మిత్రమా...

మిత్రమా,

 మన స్నేహం మరువలెనిది,
 మన చెలిమి చెరిగిపొనిది,
 ఎల్లలు లేని ఆకాశంలా
ఈ ప్రపంచమంతా విస్తరించి ఉంటుంది.
గల గల పారే గోదారిలా,
పక్షుల కిల కిలా రావంలా,
నిత్య యవ్వనమైనది మన స్నేహం.
కళాశాలలో ఏ చెట్టుని అడిగిన చెప్తుంది,
మనం చెప్పుకున్న ఊసులు,
చేసుకున్న బాసలు.
చిన్ని చిన్ని తగాదాలు,
మధ్య మధ్యలో దూరాలు,
చిరు కొపాలు,
ఇవన్నీ మన చెలిమిని బలపరిచాయే తప్ప
                                    దూరం చేయలేదు
ఒక మంచి ఆశయంతో మొదలుపెట్టిన ' అక్షర '
     మన స్నేహపు మనస పుత్రిక,
     మనం ఒక్కటే అని చెప్పే ప్రతీక.
 కష్టాల్లో, సుఖాల్లో
     కన్నీరే రానివ్వకుండా,
     స్నేహపు సిరి జల్లులు కురిపిస్తూ
     కొనసాగింది మన మైత్రి,
     వసంతాలెన్ని మారినా
     తరగని కోయిల పాట తియ్యందనం మన స్నేహం.

 ఎన్నటికీ చెరిగిపోని చరిత్రలో
     మన మైత్రి ఎన్ని యుగాలైనా నిలిచేల
     తరగని ఈ స్నేహ సంపదని ఒక కలంలా చేసి
     చిరస్తాఇగ నిలిచే ఒక చెలిమి సంతకం చేద్దాం రా...


 Note: Its for my friend Rajashekar reddy who went to U.S for the M.S

నాన్న

ఇవాళ సాయంత్రం చెల్లి ఇంటి నుండి తిరిగి వస్తుంటే ఎందుకో మేము చిన్నప్పుడు కలిసి చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.మా నాన్నగారు మమ్మల్ని తీసుకువె...