గత కొన్నెళ్ళుగా (మూడ)భక్తి బాగా పెరిగిపోయిందని నా అభిప్రాయం. అర్థంలేని విషయాల కోసం కొట్టుకోవడం, ఇతరుల్ని దూషించడం ఎక్కువయ్యాయి.ప్రతి దానికి చెప్పే కారణం అది మన సంప్రదయం కాదు అని. సమాజంలో విలువలు తగ్గిపొతున్నాయి అని ఒక మాట అనేసి కుర్చోడం. నిర్భయ సంఘటనకి బాధ్యుల్లొ ఒక వ్యక్తి చెప్పిన సమాధానం "సంప్రదయ బద్దమైన ఆడ పిల్లలు రాత్రి 9 తర్వాత బయట తిరగరు. రేప్ లకి కారణం అబ్బాయిలకంటే అమ్మాయిలే.
ఆడ మగ సమానం కాదు.ఇంటి పనులు,కుటుంబాన్ని చుస్కోడం ఆడాళ్ళ పని, డిస్కోల్లో బార్లలో తిరగడం అనుచితమైన బట్టలు వేస్కోడం ఇవన్ని చేయకూడదు. కేవలం 20% ఆడపిల్లలే మంచి వాళ్ళు". ఇదేదొ కేవలం ఒక వ్యక్తి అలోచనగా మనం తీసివేయలేం ఎందుకంటే బాహాటంగా అందరిముందు చెప్పలేకపోయినా చాలా మంది మనసుల్లో ఉన్న భావం ఇది. వేరొక వ్యక్తితో మాట్లడినప్పుడో లేదా సన్నిహితుల మధ్య ఉన్నప్పుడో మనసులో ఉన్న మాట ఎలాంటి జంకు లేకుండా బయటికి చెప్పేస్తాం. ఇంతగా కొట్టుకు చచ్చిపోతున్నాం ఈ సంప్రదాయం కోసం, అసలు ఎక్కడిది ఈ సంప్రదాయం? ఒకప్పుడు సతి సహగమనం సంప్రదాయం, మనమంతా దాన్ని వ్యతిరేకించి , అంతమొందించిన ఎంతొ మందిని గొప్పవాళ్ళుగా చూస్తున్నాం. కాని దానిని వ్యతిరేకించిన నాడు ఆ గొప్పవాళ్ళంతా సంప్రదాయ హీనులుగానే చుడబడ్డారన్న నిజాన్ని ఎందుకు అశ్రద్ధ చేస్తున్నాం? ఈ మధ్య ఒక పెద్దాయన "భర్త చనిపోయాక భార్య ఒక్కర్తే జీవించడం కష్టం అందుకే ఒకప్పుడు సతి సహగమనం చేసేవారు" అని అన్నారు. వినటానికి ఇది చాలా సులువుగా అనిపించొచ్చు కాని నిజానికి ఈ అలోచనలో పూర్తి నిజం లేదు. ఇది అందరికి వర్తించదు. ఏ సంప్రదాయం ఐతే తల్లితండ్రుల్ని గౌరవించాలి అని చెప్పిందో దానికి వ్యతిరేఖంగా ఉంటుంది ఈ సతి సహగమనం. ఒకప్పుడు సమాజం గొప్ప నీతితో ఉంది అనప్పుడు తల్లిని జాగ్రత్తగా చూసుకునే కొడుకులు కూతుర్లు లేరా ఆనాటి సమాజంలో? నా ఉద్దేశం ప్రకారం ఒకప్పుడు రాజులు చాల మంది భార్యల్ని కలిగి ఉండేవారు, యుద్ధంలో రాజు చనిపోతే అతని భార్యలంతా శత్రువు వశం అవుతారు. ఆ రాజు వారిని చిత్రవధ చేసి చంపేయొచ్చు లేదా బానిసలుగా దాసిలుగా ఉంచుకోవచ్చు. ఏది ఏమైనా ఇంత అందమైన రాణి జీవితం నుండి బానిసలుగా బ్రతకడం అనేది చాలా కష్టం.ఆ భయం కొద్దీ వారంతా అత్మహత్యలు చేస్కునే వారు లేదా రాజు శవంతో పాటు వారు కుడ మరణించే వారు. ఆనాటి సమాజంలో రాజులు మరియు బ్రహ్మణులు అగ్రవర్ణాలుగా ఉండేవారు.దీన్ని సంప్రదాయంగా మార్చి సామాన్యుల మీద రుద్దేసారు. అలా ఇది ఆచారం అయ్యింది తప్ప నాకు తెలిసి వేరే ఏ మహత్యం లేదు. ఇప్పుడు ఏవైతే మనం అంతా సంప్రదాయ విరుద్దం అంటున్నామో కొన్నేళ్ళకి ఇది మారిపోవచ్చు. ఆది మానవుడికి ఏ సంప్రదాయం ఉంది? కొన్ని దశాబ్దాలు దిగంబరంగా సంచరించారు తర్వాత ఆకులు, జంతువుల చర్మాలు కప్పుకున్నారు. అలా నాగరికత వైపు అడుగులు వేసారు. వీటన్నిటికి కారణం పరిస్తితులు,అవసరాలు.

అద్దంలొ కనిపించే మొహం అందంగ ఉండటానికి ఎన్నో రంగులు వేస్తాం, మరి నీలో ఇంత వికౄతంగా తయరవుతున్న మనసుకు ఏ రంగు వేస్తావ్?