మిత్రమా,
మన స్నేహం మరువలెనిది,
మన చెలిమి చెరిగిపొనిది,
ఎల్లలు లేని ఆకాశంలా
ఈ ప్రపంచమంతా విస్తరించి ఉంటుంది.
గల గల పారే గోదారిలా,
పక్షుల కిల కిలా రావంలా,
నిత్య యవ్వనమైనది మన స్నేహం.
కళాశాలలో ఏ చెట్టుని అడిగిన చెప్తుంది,
మనం చెప్పుకున్న ఊసులు,
చేసుకున్న బాసలు.
చిన్ని చిన్ని తగాదాలు,
మధ్య మధ్యలో దూరాలు,
చిరు కొపాలు,
ఇవన్నీ మన చెలిమిని బలపరిచాయే తప్ప
దూరం చేయలేదు
ఒక మంచి ఆశయంతో మొదలుపెట్టిన ' అక్షర '
మన స్నేహపు మనస పుత్రిక,
మనం ఒక్కటే అని చెప్పే ప్రతీక.
కష్టాల్లో, సుఖాల్లో
కన్నీరే రానివ్వకుండా,
స్నేహపు సిరి జల్లులు కురిపిస్తూ
కొనసాగింది మన మైత్రి,
వసంతాలెన్ని మారినా
తరగని కోయిల పాట తియ్యందనం మన స్నేహం.
ఎన్నటికీ చెరిగిపోని చరిత్రలో
మన మైత్రి ఎన్ని యుగాలైనా నిలిచేల
తరగని ఈ స్నేహ సంపదని ఒక కలంలా చేసి
చిరస్తాఇగ నిలిచే ఒక చెలిమి సంతకం చేద్దాం రా...
Note: Its for my friend Rajashekar reddy who went to U.S for the M.S
మన స్నేహం మరువలెనిది,
మన చెలిమి చెరిగిపొనిది,
ఎల్లలు లేని ఆకాశంలా
ఈ ప్రపంచమంతా విస్తరించి ఉంటుంది.
గల గల పారే గోదారిలా,
పక్షుల కిల కిలా రావంలా,
నిత్య యవ్వనమైనది మన స్నేహం.
కళాశాలలో ఏ చెట్టుని అడిగిన చెప్తుంది,
మనం చెప్పుకున్న ఊసులు,
చేసుకున్న బాసలు.
చిన్ని చిన్ని తగాదాలు,
మధ్య మధ్యలో దూరాలు,
చిరు కొపాలు,
ఇవన్నీ మన చెలిమిని బలపరిచాయే తప్ప
దూరం చేయలేదు
ఒక మంచి ఆశయంతో మొదలుపెట్టిన ' అక్షర '
మన స్నేహపు మనస పుత్రిక,
మనం ఒక్కటే అని చెప్పే ప్రతీక.
కష్టాల్లో, సుఖాల్లో
కన్నీరే రానివ్వకుండా,
స్నేహపు సిరి జల్లులు కురిపిస్తూ
కొనసాగింది మన మైత్రి,
వసంతాలెన్ని మారినా
తరగని కోయిల పాట తియ్యందనం మన స్నేహం.
ఎన్నటికీ చెరిగిపోని చరిత్రలో
మన మైత్రి ఎన్ని యుగాలైనా నిలిచేల
తరగని ఈ స్నేహ సంపదని ఒక కలంలా చేసి
చిరస్తాఇగ నిలిచే ఒక చెలిమి సంతకం చేద్దాం రా...
Note: Its for my friend Rajashekar reddy who went to U.S for the M.S
No comments:
Post a Comment