Sunday, September 4, 2016

పెళ్ళిరోజు

ఆకాశమంత పందిరిలో
ఆది దంపతుల ఆశీర్వచనంతో
ఆత్మీయుల ఆనాందాక్షింతలతో
పంచ భూతాల సమక్షంలో
అష్ట దిక్పాలకుల అథితులవ్వగ
మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యి
యెడడుగులతో ఏకమయ్యి
అవధులులేని ప్రేమానురాగాలతో
ఆదర్శప్రాయమైన మీ వైవాహిక జీవితం
మరో వసంతాన్ని నింపుకున్నందుకు
సంతోషిస్తూ  ...
అమ్మా నాన్న మీకు పెళ్ళిరోజు శుభాకాంక్షలు 💐

Thursday, August 11, 2016

ఒంటరితనం

ఒంటరితనమా నీవిచ్చే కౌగిలింతకు ఎదురేముంది ,
ప్రేమ,స్నేహం,అనందం,బాధ,కోపం అసూయ అన్నిటిని దూరం చేస్తావు ,
కాని నీకు నేనంటే ప్రేమ అందుకే మన ప్రేమ అమరమైంది,
కష్టాల్లో తోడున్న నిజమైన స్నేహం నీది ,
నలుదిక్కులా నన్నే చుపిస్తూ ప్రపంచాన్ని జయించాను అన్న అనందాన్ని ఇచ్చింది నువ్వే ,
ఇన్ని ఇచ్చినా నిన్ను దూరం చేస్కొడానికి ప్రయత్నించిన నన్ను చూస్తుంటే కోపం ఒస్తుంది ,
ఇంత చేసిన నిన్ను దూరం చేస్కున్నందుకు బాధగా ఉంది ,
ఈ విశాల విశ్వాన్నే ఒంటరిదాన్ని చేసిన నీ శక్తిని చూస్తుంటే నీపై అసూయ కలుగుతుంది ,
నీ ముందు నిజానికి అబద్దానికి ఉనికి లేదు ,
కరిగిపొయే కాలానికి విలువ లేదు ,
ఆస్తులు అంతస్తులు సముద్రపు ఒడ్డున పిచ్చుకగూళ్ళలాంటివి,
నీ ఒడిలోనే నిదురిస్తూ నిన్ను దరిచేరనీయకుడదని  గిరిగీసుకున్న నా అమాయకత్వాన్ని క్షమిస్తావు కదూ?!

Wednesday, June 29, 2016

మధ్య తరగతి వేదాంతం !!


రేపటి మీద ఆశ ఉండాలంటే  ఈరోజు
మీద భయం ఉండాలనుకునే బ్రతుకులు ,
గంపెడు బరువుని మీదెట్టుకుని ఆశల
చిటారు కొమ్మల్నిఅందుకోడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు!


సూర్యుని కిరణం భూమిని తాకకముందే
కష్టం వీళ్ళని నిద్రలేపుతుంది ,

ఆకలి కేకలు పెదవులు దాటకుండా
పరపతి అడ్డొస్తుంది !

మూడు పూటలు ఐదు వేళ్ళు నోట్లోకి వెళ్లాలంటే
ఎనిమిది గంటలు అలిసిపొవాల్సిన జీవితాలు ..!
ఆశయం కన్నా కష్టం నడిపించే నడకలు  నేర్చుకునేవాళ్లు . .  
ఇష్టానికి అవసారనికి మధ్య ఎన్నో లెక్కలు వెస్కుంటారు…    
బంధం , బాధ్యత రెందు ఒకటే అనుకుంటారు!    

పండగ అంటె పరమాన్నం వండిన రోజు!
అదౄష్టమంటే అప్పు దొరికే రోజు,
మజ్జిగ గట్టిగ కలిపితె పెరుగని సర్దిచెప్పుకుంటారు !  
బ్రతకటానికి భయం ఎక్కువ చావటానికి ధైర్యం తక్కువ !
నిచ్చెనలు పాములు ఒకటి వెంట ఒకటి వచ్చే వైకుంటపాళి ఆటే ఈ జీవితం!  

వేసే ప్రతీ అడుగు ముందుకు సాగుతుందనుకుంటు
ఆ మిథ్యలోనే  మొదలెట్టిన చొటే పయనం ముగిస్తారు!  

బడుగులకి బడాబాబులకి,
ఆశకి అవసరానికి ,
వెలుగుకి చీకటికి ,
అప్పుకి ఆదాయానికి ,
గాలిలో పెట్టిన దీపపు వెలుగులా కొట్టుమిట్టాడుతూ ఉంటారు !!

బహుశా లోకంలో ఉన్న సన్యాసులందరూ ఒకప్పుడుమధ్యతరగతి వాళ్ళేనేమో !!

Wednesday, May 4, 2016

ఏమున్నది?

పనేముంది మిత్రమా నీతో ఈలోకానికి?
ఒక్క నువ్వు చేసే సాయం తప్ప!

అవసరమేముంది మిత్రమా నీతో ఈ జనానికి?
నువ్వు సంపాదించే నోట్ల కట్టలతో తప్ప!

మనిషికి మనసుకి అర్థమే మార్చిన ఆ సమాజంలో
మనసున్న మనిషిగా బ్రతికే అర్హత నీకు లేదు .
డబ్బే గౌరవానికి కొలమానమైన ఈ కాలంలో
మనసున్న మహారాజువైన డబ్బులేకుంటే దరిద్రునివే !
వేగంతో వెర్రులెత్తిపొయే ఈ రోజుల్లో
ఆచి తూచి ఆలోచనతో అడుగెయ్యాలనుకుంటే నువ్వు అసమర్ధుడిగానే మిగిలిపోతావ్!

ఇక్కడ జాలికంటే జువెల్లరీకే విలువెక్కువ
దయ కంటే దాచుకున్న డబ్బే నిను వేనోళ్ళ కీర్తింపజేస్తుంది!
ఇక్కడ మనిషి జీవితం మార్కెట్లో దొరికే మల్లెపువ్వులాంటిది
డబ్బనే సువాసన ఉన్నంత వరకే దానికి విలువ !
ఇక్కడ నీమంచితనానికంటే మతానికే గుర్తింపెక్కువ ,
మతం మనిషికి ఎలా బ్రతకాలో నేర్పిస్తే
విచక్షణ కోల్పోయి మతం మత్తులో చంపుకుంటారు !!

పొద్దున్నే ఆలయంలో వేయి రూపాయలతో అమ్మవారికి అభిషేకం,
సాయంత్రానికి అదే వేయితో వేశ్యల సంతలో అమ్మాయిలతో బాగోతం,
ఇంట్లోకి మాత్రం లక్ష్మి కావాలి 
కాని అర్ధాంగి ఒళ్ళోని ఆడపిల్ల గొంతు నొక్కేస్తారు. 
ఏమైపోతుంది ఈ లోకానికి ?? 
అందమైన శిల్ప కళను చూపిస్తే బూతుబొమ్మలను చుస్తున్నరే ??
ఆడదాని బట్టల్లో అశ్లీలం కనిపించిన ఈ సమాజానికి 
మగవాడి కళ్ళలో దాగున్న కామం కనిపించలేదా ?? 
సెల్లుఫోనుల్లో ఆడుతున్న వీడియోల్లో దొరకలేదా ?

వేల మంది గోపికల ప్రియుడిగా కన్నా 
ద్రౌపదిని రక్షించిన అన్నగా కౄష్ణుడిని  చూస్తేనైనా మారుతుందేమో !! 

Sunday, April 10, 2016

I'm a bad boy #1

దేవుడు మనల్ని సౄష్టించాడు , మన తల రాతని ఆయన ముందే రాసేసాడు. 

ఈ సౄష్టికి కర్త , కర్మ , క్రియ అన్నీ నేనె . 

పిల్లలు దేవుళ్ళతో సమానం. 
-------------------------------------------------------
ఇవన్ని దేవుడ్ని నమ్మేవాళ్ళు , పూజించేవాళ్ళు చెప్పెవి. కాని తమ పిల్లలు కోరుకున్నది ఎంటి అనేదానికంటే , వాళ్ళ ద్రుష్టిలో ఏది సరైనదో అదే మంచిదని ఒక నిర్నయానికి వచ్చేస్తారు. 
పిల్లలు దేవుళ్ళతో సమానం ఐతే మరి దేవుడిని ఎలా ఎదిరిస్తారు ? సరే , పిల్లలకి ఏం కావాలో తల్లిదండ్రులుగా మీకు ఎక్కువ తెలుసు అనుకుందాం , కాని ఒకసారి ఆలొచించండి ఎందుకు వాళ్ళు ఆ మార్గాన్ని ఎంచుకున్నారో . 

ఏం చేస్తే భవిష్యత్ బాగుంటుంది అనే దానికంటే ఏం చేస్తే భవిష్యత్ లో ఆనందంగా ఉంటారో ఆలొచించండి. అరచేతిలో ఇమిడే చిన్న విత్తనం ఆకాశం అంత ఎత్తు ఎదిగే చెట్టునిస్తుంది. ఆ విత్తనాన్ని అరచెతిలొనే చిదిమేయకుండా నాటదానికి ప్రయత్నించండి. 

ఇవాల కొంత మంది చిన్న పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటున్నారు , అందరూ పది సంవత్సారాల లోపు వాళ్ళే . వారిలో ఒక పిల్లాడు ప్రతిసారి కిందపడుతున్నాడు లేస్తున్నాడు . చూస్తున్న వాళ్ళందరికి తెలుసు ఆ పిల్లాడికి అది ఇష్టం లేదని. ఆ పిల్లాడి తండ్రి లేవమని తిడుతున్నాడు !! తన స్నేహితులతో పోలుస్తూ ఎందుకు పనికిరావని అరుస్తున్నాడు !! దేనికి ఇదంతా ?? ఇలా చేస్తే వాడిని వాడు ఎప్పుడూ చేతకాని వాడి లాగే లెక్కేసుకుంటాడు .  

ఈ విషయం అర్థం అయ్యి కూడా నిజం చెప్పలేదు నేను. 
అందుకే I'm a bad boy!! 

నాన్న

ఇవాళ సాయంత్రం చెల్లి ఇంటి నుండి తిరిగి వస్తుంటే ఎందుకో మేము చిన్నప్పుడు కలిసి చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.మా నాన్నగారు మమ్మల్ని తీసుకువె...