Thursday, January 17, 2013

లేఖ

ఓ మిత్రమా,

నీ దూరంతో బరువెక్కిన హ్రుదయం సాక్షిగా నీకు రాస్తున్న మొదటి లేఖ,

కొన్ని కొన్ని సార్లు మనం ఎందుకు వింతగా ప్రవర్తిస్తామో, ఎందుకు మనకే తెలియకుండా బాధ పడుతుంటామో అర్థం కాదు. ముఖ్యంగా ఎవరైనా మనకి కావలసిన వాళ్ళు దూరమౌతుంటే మనకి అర్థం కాని ఎన్నో భావాలు మనలో కలుగుతూ ఉంటాఈ. ఇది సహజమా లేక ఈ భావన కల్పితమా..? దీనికి సమధానం మాత్రం కాలం కచ్చితంగా ఇవ్వలేదు, ఇది మనిషి నుండి మొదలైంది కాబట్టి మనిషే దీనికి  సమాధానం ఇవ్వాలి? ప్రేమకి అర్థం ఎంటో నాకు తెలియదు కాని స్నేహం అంటే ఎంటో మాత్రం తెలుసు. ఎన్నో ఏళ్ళు నీ సావాసం  ఒక్కసారిగా దూరం ఐతే ఆ దూరం మిగిల్చే అగాథం పూడ్చలేనిది. ఎన్నో మార్గాలు ఉండి ఉండొచ్చు ఆ శూన్యాన్ని పూరించేందుకు కాని దాని ఆనవాల్లని మాత్రం చెరపలేవు. ఎన్నేళ్ళైనా ఆ గుర్తులు చెరిగిపోవు. స్నేహానికి ఎల్లలు లేకపొవచ్చు కాని మనుషుల మధ్య  దూరానికి కొలమానాలు ఉన్నాఈ.మనసులకి దూరం లేదేమో కాని మనసుకి దగ్గరైన మనుషులు దూరమైనప్పుడు మనసుపడే అవేదనకి హద్దులు లేవు.మంచి ఆశయంతో దూరంగా ఉంటున్నారని మన మనసుని సమాధాన పరుచుకొని సంత్రుప్తి చెందడం మినహా మనం చేయగలిగేది ఏమీ లేదు.

 ఓ మిత్రమా నీ పడమటి వైపు ప్రయాణం నిన్ను నీ ఆశయానికి దగ్గర చేస్తుంది అంటే దానికి మించిన అనందం మాకేముంటుంది చెప్పు,కాని నీకొసం నిరీక్షించే కళ్ళు ఉన్నాయని, నీ స్నేహామౄతం కోసం తపించే రెండు హ్రుదయాలు నీ రాక కోసం వేచి చూస్తుంటాయని మరువకు …
                   
                                                                                                                  ఇట్లు                                                                                                                                                                                                                      ఓం & నిఖిల్

No comments:

నాన్న

ఇవాళ సాయంత్రం చెల్లి ఇంటి నుండి తిరిగి వస్తుంటే ఎందుకో మేము చిన్నప్పుడు కలిసి చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.మా నాన్నగారు మమ్మల్ని తీసుకువె...