మనం జనం , జనం మనం
మనం లేని జనం లేరు
జనం లేని మనం లేము
'నా' అన్నది లేనినాడు
కొట్లాటలు కానరావు
పోట్లాటలు రానేరావు
'మనం' అన్నది ఉన్ననాడు
వికసించును శాంతిపుష్పం
భాసిల్లును 'మన ' ప్రపంచం.
తేనెల తేటల తెలుగు. మన మాతౄబాష తెలుగు. నా భావం తెలుగు. నా మూలం తెలుగు. అందుకే నా కవిత్వం కూడా తెలుగు.
ఇవాళ సాయంత్రం చెల్లి ఇంటి నుండి తిరిగి వస్తుంటే ఎందుకో మేము చిన్నప్పుడు కలిసి చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.మా నాన్నగారు మమ్మల్ని తీసుకువె...