Monday, October 12, 2015

అస్తమయం

ముందుమాట
మనిషి జీవిత లక్ష్యం ఆనందంగా జీవించటం, సంఘంలో గౌరవంగా బ్రతకటం.
దానికి డబ్బు అవసరం అని దానికోసం మనిషి పడే ఆరాటం అంతా ఇంతా కాదు, కాని ఆ ఆరాటం లో మనం చేసే తప్పులు కొన్ని జీవితాల్నే తుడిచేయగలవు. అందరు చేస్తున్నారు కాబట్టి మనం కుడా చేస్తే అది ఒప్పు అవదు. అలాంటి ఆలోచనలోనుండి పుట్టిందే ఈ కథ

*********************************************************************************

సూర్యుని కిరణాలు తన గూటిని చేరకముందే తన గుండెని ఆపాలనుకున్నడేమో, ఉదయాన్నే ఊరి చివరన ఉన్న తన పొలానికి బయలుదేరాడు ఆ బక్కచిక్కిన రైతు. మూడుముళ్ళతోనే తన బ్రతుకును ముడివేసిన తన భార్యని చూసాడు, అరకాసంత ఉన్న తన ఐదోతనం అతనిని అరక్షణం కూడా అక్కడ ఉంచలేకపోయింది. గుడిసెముందున్న అవిటిదైన ఎడ్ల బండి లాగలేని తన బ్రతుకుబండిని గుర్తుకుతెచ్చిందో ఏమో భారంగా పొలంవైపు దారి తీయసాగాడు. కడుపున పుట్టకపోయినా కన్న తండ్రిలాగ చూసుకున్న యజమానిని చూడటం ఇదే ఆఖరుసారి అని 

పసిగట్టాయేమో ,  ఆగిపొమ్మని ఆశగా చూస్తున్నాయి.  ఆ పలుపు తాడు తమకి వేయమని  దీనంగా అర్థిస్తున్న

ఆ మూగజీవాల్ని చూస్తూ ఆర్ద్రతతో నిండిన కళ్ళు తుడుచుకుంటూ అడుగులు వేయసాగాడు. పొలంగట్టున 

పైరు  గాలుల జాడలేక ఒంటరైన చెట్టు వేళకాని వేళ వచ్చిన అన్నదాతను చూసి ఆశ్చర్యపొఇంది. 

జరగబోయే దారుణం గ్రహించిందేమో తన ప్రాణదాత ప్రాణం తీయలేనన్నట్లు అటు ఇటు ఊగుతోంది. 

జీవితంలోని కష్టాలన్ని కలిపి గట్టిగా వెసిన ముడిని విప్పమని అర్తిస్తూ ఆకులు రాలుస్తుంది.

మెడకు బిగించుకున్న ఉరితాడు మరొకసారి ఆలోచించమని మొరపెట్టుకుంటుంది.అన్నదాత అస్తమయాన్ని ఆపలేక బీటలువారిన భూమి మౌనంగా ఉండిపొయింది. తన ఆప్తుడి పాదాలు చేస్తున్న మృత్యు నాట్యానికి లయగా 

 ఆ గాలి హోరుమని విలపిస్తుంది. ఆ పాదస్పర్శకోసం ఆరాటంతో పరుగులు తీస్తుంది. 

ఆన్నదాత శరీరపు చల్లదనానికి ఆ నింగి కరిగి నీటి ఉప్పెనను నేల మీదకు జారవిడిచింది.


*********************************************************************************

హైదరాబాదులోని అత్యంత ఖరీదైన హోటల్ అది. రాష్ట్రంలోని ప్రముఖులందరు ఒకరి తర్వాత ఒకరు అక్కడికి చేరుకుంటున్నారు. కొన్ని వందల కెమెరాలు అక్కడి అందాల్ని బంధిస్తున్నాయి. దేశంలోనే అతి పెద్ద పారిశ్రామికవేత్త అర్జున్ ఇస్తున్న విందు అది. అర్దాంతరంగా వచ్చిన వాన వల్ల కొంచెం ఆలస్యంగా మొదలైంది.  తన కొత్త భాగస్వాములతో మొదలుపెట్టిన వ్యాపారాలా విజయవంతం అవడంతో తన పుట్టినరోజుని ఇలా అట్టహాసంగా జరుపుకుంటున్నాడు. 60 ఏళ్ళ వయసులో ఈ పొకడలేంటి అనుకున్నవారు లేకపోలేదు కాని రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు డబ్బులున్నవాడు ఏమైన చెస్కుంటారు అని సమధాన పడ్డారు. కేక్ కట్టింగ్ కోసం అందరూ వేచి చుస్తున్నారు. ఆర్జున్ మాత్రం తన గదిలో తన భార్య పిల్లల ఫొటోని చూస్తూ కుర్చున్నాడు. మెల్లిగా ఆ ఫొటో ఎర్రగా మారింది. తన ఒంట్లోని ఒక్కొక్క రక్తపు చుక్క తన చేతుల్ని విడిచి నేలను ముద్దాడుతుంది. గదిలోని ప్రతి వస్తువు ఏమయ్యింది ఈ మహరాజుకి అని ఆశర్యంగా చూస్తున్నాయి...

(Will post the next story soon...)

Wednesday, August 19, 2015

పడమటి పయనం

జననమరణాలు ఆడే ఆటే ఈ జీవితం,
ఆ ఆటని నడిపే పావులే ఈ ఆశ నిరాశలు.

ఓటమిలోనుండే గెలుపు పుట్టేది,
గెలుపు అంచుల్లొనే ఓటమి ఉనికి ఉండేది.
అందుకే మిత్రమా ! నువ్వు గెలిచినా ఓడినట్టే..
ఓడినా గెలిచినట్టే..!

గెలుపుకోసం మనం నిరాశను దాటి ఆశను చేరాలనుకుంటాం,
కాని ఆ ఆశకి ఆవల ఉండేది నిరాశా మిత్రుని ఓటమి ఎదురుచూపులే.
ఆశా నిరాశలు నిన్ను ఓటమికి దగ్గర చేసే వాహనాలే!
నీ పయనం గెలుపోటముల ఛట్రం లో ఆగిపోకుడదు,
ఈ రెంటిని గెలిచే స్థైర్యం నీ గమ్యం అవ్వాలి !

అస్తమించే సూర్యుని వెలుగు చివరనే చీకట్ చిగురించేది,
నీ గమ్యం వెలుగు చీకట్లు కాదు ఆ రెంటి జన్మస్థలం.
ఆశకి అడుగు దూరంలోనే నిరాశ నవ్వుతూ ఉంటుంది,
ఆ రెండిటినీ వదిలి ఆ నవ్వుని మాత్రం నీతో ఉంచుకో.

నిరాశ నిన్ను కారుమబ్బులా కమ్మినప్పుడు,
ఓటమి నిన్ను జడివానలా తడిపేస్తుంటే,
ఆ రెండిటి ఉరుముల మెరుపులకు చలించకు.
నిరాశ ఉరుముల కన్నా ఆశ ఇచ్చే ధైర్యం గొప్పది,
దాన్ని ఒడిసి పట్టుకో,
ఓటమి మెరుపుల్లో నీ గమ్యానికి దారి వెతుక్కో !!


                                             ఉన్నత చదువులకోసం వేరే దేశం వెళ్ళిన నా మిత్రుని కోసం....


Friday, January 2, 2015

యెంకి పాట

నండూరి గారి స్పూర్తితో నేను రాసిన ఈ యెంకి పాట తెలుగు వారందరికి అంకితం..


నాన్న

ఇవాళ సాయంత్రం చెల్లి ఇంటి నుండి తిరిగి వస్తుంటే ఎందుకో మేము చిన్నప్పుడు కలిసి చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.మా నాన్నగారు మమ్మల్ని తీసుకువె...