Wednesday, August 19, 2015

పడమటి పయనం

జననమరణాలు ఆడే ఆటే ఈ జీవితం,
ఆ ఆటని నడిపే పావులే ఈ ఆశ నిరాశలు.

ఓటమిలోనుండే గెలుపు పుట్టేది,
గెలుపు అంచుల్లొనే ఓటమి ఉనికి ఉండేది.
అందుకే మిత్రమా ! నువ్వు గెలిచినా ఓడినట్టే..
ఓడినా గెలిచినట్టే..!

గెలుపుకోసం మనం నిరాశను దాటి ఆశను చేరాలనుకుంటాం,
కాని ఆ ఆశకి ఆవల ఉండేది నిరాశా మిత్రుని ఓటమి ఎదురుచూపులే.
ఆశా నిరాశలు నిన్ను ఓటమికి దగ్గర చేసే వాహనాలే!
నీ పయనం గెలుపోటముల ఛట్రం లో ఆగిపోకుడదు,
ఈ రెంటిని గెలిచే స్థైర్యం నీ గమ్యం అవ్వాలి !

అస్తమించే సూర్యుని వెలుగు చివరనే చీకట్ చిగురించేది,
నీ గమ్యం వెలుగు చీకట్లు కాదు ఆ రెంటి జన్మస్థలం.
ఆశకి అడుగు దూరంలోనే నిరాశ నవ్వుతూ ఉంటుంది,
ఆ రెండిటినీ వదిలి ఆ నవ్వుని మాత్రం నీతో ఉంచుకో.

నిరాశ నిన్ను కారుమబ్బులా కమ్మినప్పుడు,
ఓటమి నిన్ను జడివానలా తడిపేస్తుంటే,
ఆ రెండిటి ఉరుముల మెరుపులకు చలించకు.
నిరాశ ఉరుముల కన్నా ఆశ ఇచ్చే ధైర్యం గొప్పది,
దాన్ని ఒడిసి పట్టుకో,
ఓటమి మెరుపుల్లో నీ గమ్యానికి దారి వెతుక్కో !!


                                             ఉన్నత చదువులకోసం వేరే దేశం వెళ్ళిన నా మిత్రుని కోసం....


No comments:

నాన్న

ఇవాళ సాయంత్రం చెల్లి ఇంటి నుండి తిరిగి వస్తుంటే ఎందుకో మేము చిన్నప్పుడు కలిసి చేసిన అల్లరి గుర్తుకు వచ్చింది.మా నాన్నగారు మమ్మల్ని తీసుకువె...